సీపీ సజ్జనార్ ఖబడ్దార్!: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సీపీ సజ్జనార్ ఖబడ్దార్.. నన్నే ఏమీ చేయలేకపోయావ్.. ఇంకా కేసీఆర్‌ను ఏం చేస్తావ్? అని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సీపీ సజ్జనార్ ఖబడ్దార్.. నన్నే ఏమీ చేయలేకపోయావ్.. ఇంకా కేసీఆర్‌ను ఏం చేస్తావ్? అని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను విచారణల పేరుతో అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
డీజీపీ కావాలని సజ్జనార్ కలలు కంటున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా? అని ప్రశ్నించారు. పింక్‌బుక్‌లో సజ్జనార్ నంబర్-1లో ఉంటారని, సజ్జనార్ కర్ణాటక పోయినా, ఫుణె పోయినా, ఎంపీ అయినా తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేయడం అంటే బ్రిటీష్ వాళ్లపై పోరాడి స్వా తంత్య్రం తెచ్చిన గాంధీకి నోటీసులు ఇవ్వడమన్నట్టుగా అభివర్ణించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం వల్లే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇద్దరూ అధ్యక్షులు అయ్యారని గుర్తుచేశారు.
సజ్జనార్‌ను గుంజుకొస్తాం : కురువ విజయ్
తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో సీపీ సజ్జనార్ కర్ణాటకలో మాల్స్ కట్టారని బీఆర్ఎస్ నేత కురువవిజయ్ ఆరోపించారు. సజ్జనార్ హుబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సజ్జనార్ పార్లమెంట్‌కు వెళ్లినా రప్పా, రప్పా గుంజుకొని వస్తామని హెచ్చరించారు. పోలీసులను కంట్రోల్లో పెట్టుకోవాలని డీజీపీకి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

