హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమం సందడిగా జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బీజేపీ నుంచి రాకేశ్రెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, గోరటి వెంకన్న మాత్రమే హాజరయ్యారు.