చండూరు (గట్టుప్పల్), అక్టోబర్ 9 : మునుగోడులో ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన కొందరు వారంలోనే మోసపోయామని తెలుసుకొని తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు.
అంతేగాకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ బూత్ ఇన్చార్జి గంజి గణేశ్‌తోపాటు కార్యకర్తలు, సానుభూతిపరులు 200 మంది మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.