స్వరాష్ట్రంలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం, గుర్తింపు లభించిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో ఆర్యవైశ్యులకు రాని గుర్తింపు, స్వరాష్ట్రం వచ్చిన తొమ్మిదేండ్లలోనే వచ్చిందని ఒక ప్రకటనలో పేరొన్నారు.
- కేసీఆర్ పాలనలోనే గౌరవం
- కోలేటి దామోదర్‌గుప్తా వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం, గుర్తింపు లభించిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో ఆర్యవైశ్యులకు రాని గుర్తింపు, స్వరాష్ట్రం వచ్చిన తొమ్మిదేండ్లలోనే వచ్చిందని ఒక ప్రకటనలో పేరొన్నారు. ఉమ్మడి పాలనలో ఆర్యవైశ్యులను కరివేపాకు మాదిరిగా వాడుకొని, ఎన్నో అవమానాలకు గురిచేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలతో సమానంగా ఆర్యవైశ్యులను కూడా అకున చేర్చుకున్న కేసీఆర్, ఆర్యవైశ్యుల ఆత్మాభిమానానికి ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు. ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్యభవన్కు ఐదెకరాల భూమి ఇచ్చిన మానవతావాది కేసీఆర్ అని ప్రశంసించారు.
అనేక మందికి పదవులు
రాజకీయంగానూ ఆర్యవైశ్యలకు సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారని దామోదర్ గుప్తా గుర్తు చేశారు. నలుగురికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 11 మంది కి మున్సిపల్ చైర్మన్, ఐదు వైస్ చైర్మన్, ఐదు మారె ట్ కమిటీ చైర్మన్, ఒకరికి ఎమ్మె ల్సీ, మరొకరికి ఎమ్మె ల్యే పదవులు వచ్చాయని చెప్పారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన మహిళను హైదరాబాద్ మారెట్ కమిటీ చైర్మన్‌గా నియమించి, ఆర్యవైశ్య సామాజికవర్గానికి పెద్దపీట వేశారని వివరించారు.
అత్యధికంగా ఆర్యవైశ్యులే..
రైస్‌మిల్లు వ్యాపారంలో అత్యధికంగా ఆర్యవైశ్యులే ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రైస్ మిల్లులు కళకళలాడుతున్నాయని దామోదర్ గుప్తా పేర్కొన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, దీంతో ధాన్యం ఉత్పత్తి పెరిగి రైస్ మిల్లులు ప్రస్తుతం బిజీగా మారాయని చెప్పారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి బాసటగా నిలిచిన కేసీఆర్‌కు ప్రతి ఒకరూ అండగా నిలిచి, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి కృషి చేయాలని దామోదర్ విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

