Aruri Ramesh : మున్సిపల్ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aruri Ramesh ) కాషాయం పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన తన రాజీనామా లేఖను విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాని వెల్లడించారు. బుధవారం తాను సొంత (బీఆర్ఎస్) గూటికి చేరుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
‘భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆదేశాల మేరకు నా ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్లోకి త్వరలో పలువురు నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి చేరాలని నిర్ణయించుకున్నాను’ అని ఆరూరి రమేష్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2024 మార్చి 17న రమేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన తిరిగి సొంతగూటికి రాబోతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆరూరి రమేష్ pic.twitter.com/4ZwZg2Yy34
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2026