హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తె లంగాణ): అరుణోదయ సాంస్కృతిక సమా ఖ్య 50 వసంతాల సభలను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా కళాకారులు నిర్వహించిన డప్పు, డోలు, గుస్సాడి, కోలాటం, డప్పుచప్పుళ్ల ప్రదర్శనలతో సుందరయ్య పార్కు వద్ద కోలాహలం నెలకొన్నది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన వామపక్ష పార్టీల కార్యకర్తలు ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆ ప్రాంతం అరుణ శోభితమై కళకళలాడింది.
అరుణోదయ తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ కార్యదర్శి మల్సూర్, ఏపీ అధ్యక్షులు బోయ సుంకులు, సుధాకర్ హాజరైన ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జయధీర్ తిరుమల్‌రావు, కొండా నాగేశ్వర్రావు, కట్టా భగవంతరెడ్డి, కొల్లాపురం విమల, మనోజ, రైతుకూలీ సంఘం నాయకులు కర్నాకుల వీరాంజనేయులు, పటోళ్ల నాగిరెడ్డి, పీవోడబ్ల్యూ నేతలు సుజ్ఞానమ్మ, అరుణ, పీడీఎస్‌యూ నాయకులు అల్లూరి విజయ్, సతీశ్ పాల్గొన్నారు.