TGS RTC | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ది. ప్రమాదాలను గుర్తించి అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడీఏఎస్) అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారులపై ప్రయాణించే 200 బస్సుల్లో 2022 సెప్టెంబర్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ సిస్టంను అమర్చారు. 2023 – 24 మధ్య ఈ మూడు ఎన్‌హెచ్‌లపై ఆర్టీసీ బస్సు ప్రమాదాలు 40 శాతం తగ్గిన్నట్టు గుర్తించారు. ఐఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఐఎన్ఏఐ నేతృత్వంలో ప్రభుత్వం, ఇంటెల్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి.
ప్రమాదాల నివారణ కోసం పైలట్ ప్రాజెక్టు కింద ఇంటెల్ సంస్థకు చెందిన‘మొబిల్ ఐ అడాస్’ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీలో వాహనం విండ్‌షీల్డ్‌కు కెమెరా అమరుస్తారు. ఇది రహదారిని సాన్ చేసి ముందుగానే ప్రోగ్రామ్ చేసిన ఆల్గారిథమ్ను అనుసరించి దేనినైనా ఢీకొనే ప్రమాదం ఉందని పసిగడితే వెంటనే ఆడియో, వీడియో రూపంలో డ్రైవర్‌ను అల ర్ట్ చేస్తుంది. ఎలాంటి సిగ్నల్ లేకుండా ఉన్నలేన్ నుంచి పకలేన్లోకి వాహనం వెళ్లినా హెచ్చరికలు చేస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీకి ఆమోదం తెలిపితే పూర్తిస్థాయి వినియోగానికి టెండర్లు ఆహ్వానించే అవకాశాలున్నాయి.