మార్చి 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్

హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తిఉన్న తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు www.joinindianarmy.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ ర్యాలీలో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్, అమ్యునేషన్ ఎగ్జామినీర్), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జియర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు ఫిబ్రవరి 18 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు వారి విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలనకు రిపోర్టింగ్ సెంటర్లలో హాజరుకావాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఒక్కచోట చేరకుండా హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌తోపాటు సమీపంలో మొత్తం నాలుగు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయంలో లేదా 040-27740059 లేదా 040-27740205 నంబర్లలో సంప్రదించవచ్చని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగుతుందని, మధ్యవర్తులెవరైనా డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అన్ని అర్హతలతోపాటు శ్రమించేతత్వం ఉన్నవారికి తప్పక అవకాశం లభిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్‌కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’
- విలీన గ్రామాల్లో ప్రగతి పరుగులు
- పేదల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం
- ఛత్తీస్‌గఢ్‌లో కాకతీయుల దంతేశ్వరాలయం
- డీఎంహెచ్‌వో ఆఫీస్, కేఎంసీలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభం
- గబ్బాలో మన దెబ్బ
- ఆయిల్ పామ్‌తో మంచి లాభాలు