డోర్నకల్, నవంబర్ 28: కలకత్తా ఆర్మీ బేస్ క్యాంపులో విధు లు నిర్వహిస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన ఆర్మీ జవాన్ కొదిరిపాక సతీశ్ (34) గుండెపోటుతో గురువా రం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. సతీశ్ తండ్రి కనకయ్య చిన్నతనంలో మృతి చెందగా, తల్లి ఎల్లాబాయి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నది. సతీశ్ 2011లో ఆర్మీకి ఎంపికయ్యాడు. నాలుగేండ్ల క్రితం నర్సంపేటకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు.
కలకత్తా ఆర్మీ బేస్ క్యాంపులో ఉద్యోగం చేస్తూ మంగళవారం గుండెపోటు రా వడంతో పశ్చిమబెంగాల్ బా గ్ దోగారా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన భౌతికకాయం శుక్రవారం సాయంత్రం డోర్నకల్‌కు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
గుండెపోటుతో పదేండ్ల బాలిక మృతి
దండేపల్లి (జన్నారం), నవంబర్ 28 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడకు చెందిన దిగుట్ల సమన్విత (10) గుండెపోటుతో మరణించింది. దిగుట్ల నాగరాజు-అనూష దంపతుల కుమార్తె సమన్విత జన్నారంలోని కృష్ణవేణి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నది. గురువారం సాయంత్రం సమన్వితకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందింది.