Arekapudi Gandhi | హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పీఏసీ చైర్మన్‌గా నియమితులైన అరికెపూడి గాంధీ ఒంటరయ్యారు. అసెంబ్లీలో తన చాంబర్‌ను గురువారం అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఒక్క మంత్రి కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ హాజరుకాలేదు. అసెం బ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు.
కనీసం పీఏసీలో సభ్యులు,ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యు లు హాజరుకాకపోవడంతో ఆయన ఒంటరయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా రు. అటు కాంగ్రెస్‌కు, ఇటు బీఆర్ఎస్కు దూరం కావడంతో ఒంటరిగా మిగిలిపోయారని విశ్లేషిస్తున్నారు. పీఏసీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ ఎంతో అట్టహాసంగా జరగాల్సి ఉండ గా ఒక్కరు కూడా హాజరుకాలేదని అనుచరు ల వద్ద గాంధీ ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
తాను ఎటూ కాని వాడిగా మిగిలిపోవాల్సి వస్తున్నదని నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నాయకుల వద్ద ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి తప్పుడు నిర్ణయం తీసుకున్నా నా? అంటూ అంతర్మథనం చేసుకుంటున్న ట్టు సమాచారం. బీఆర్ఎస్లో ఉన్న పాత సహచరులతోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. పీఏసీ చైర్మన్ పోస్టును ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో నిరసన తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను నిలదీసింది.