హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమికి సంబధించిన వివాదంపై చేవెళ్ల, మోకిలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆయన భార్య రజిత, తల్లి రాజుభాయి దాఖలు చేసుకున్న పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పు ను రిజర్వు చేస్తున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ ప్రకటించారు.