హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్ అవసరాలు తీరిన తర్వాత, ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల జలాలకు ఎలాంటి నష్టం లేకుండా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోవాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ముంపు, భూసేకరణ తదితర నష్టాల నేపథ్యంలో గోదావరి నుంచి కావేరికి మళ్లించే నీటిలో 50 శాతం వాటాను తెలంగాణకే కేటాయించాలని స్పష్టం చేసింది.
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం చైర్మన్ వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో సోమవారం జలసౌధలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్రలతో చర్చించారు. తెలంగాణ సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పాల్గొని ప్రాజెక్టులో ప్రతిపాదించిన పలు అంశాలపై అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు రాష్ట్ర డిమాండ్లను గట్టిగా వినిపించారు.
ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు తెలిపాయని, అన్ని రాష్ర్టాల అనుమతితోనే రివర్ లింక్ ప్రాజెక్టులపై ముందుకుపోతామని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. సమావేశంలో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, గజ్వేల్ ఈఎన్సీ హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, గోదావరి డీడీ సుబ్రహ్మణ్యప్రసాద్, సీడబ్ల్యూసీ మెంబర్ నవీన్‌కుమార్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రా ష్ర్టాల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ తెలంగాణ డిమాండ్లు