నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై నాంపల్లి కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సురేఖ, నాగార్జున తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై క్లయింట్ల తరఫున గైర్హాజరు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. వాదనలు పూర్తి చేయాలని ఇరువర్గాల లాయర్లను కోర్టు ఆదేశించింది. కొంత సమయం కావాలని న్యాయవాదులు కోరగా విచారణను కోర్టు 30కి వాయిదా వేసింది. వచ్చే వాయిదాకు వాదనలు పూర్తి చేయాలని స్పష్టంచేసింది.