వికారాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం పూర్తికాకుండానే హడావిడిగా ప్రారంభోత్స వం చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అధికార, విపక్ష ప్రజాప్రతినిధుల మ ధ్య మాటల యుద్ధం జరిగింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ భవన నిర్మాణం ఇంకా పూర్తికాకుండానే జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. జడ్పీ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కార్ రూ.10 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించి కేవలం కాగితం మాత్రమే ఇచ్చిందని, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న కాలె యాదయ్య ఏ ఒక్కరో జు మాట్లాడలేదని దుయ్యబట్టారు. డబ్బులు ఇవ్వకపోయినా జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి చొరవతో కొంతమేర నిర్మాణం పూర్తిచేశారని, అసంపూర్తిగా ఉన్న జడ్పీ భవన నిర్మాణ పనులను సీఎం ఆశీస్సులతో పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు.
వెంట నే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పందిస్తూ ఏదో కాగితం అంటుండ్రు, ఆ కాగితం చూపిస్తే బాగుంటుందని అన్నారు. ‘కాంట్రాక్టులు మీవే, నిధులు మీకే వస్తాయి. పూర్తి చేయాల్సింది మీరే’నని గట్టిగా బదులిచ్చారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.‘ఏంది మేం మాట్లాడొద్దా?’ అంటూ యాదయ్య ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ కలుగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. కేవలం జడ్పీ చైర్పర్సన్ కార్యాలయం, సీఈవో కార్యాలయ భవన నిర్మాణాలనే పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయడం గమనార్హం. జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టిన తరువాత కూడా భవనాన్ని ప్రారంభించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్కు చెందిన జడ్పీటీసీ సభ్యులు జడ్పీ భవన ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేశారు.