హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు పెద్దపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీని వీడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. తాను బీజేపీలో చేరిన వెంటనే మానకొండూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.