న్యూఢిల్లీ: ఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు జరగనున్నది. ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(Xi Jinping) వస్తున్నారు. ఈ విషయాన్ని ఇవాళ చైనా సర్కారు కన్ఫర్మ్ చేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి జీ జిన్‌పింగ్ హాజరుపై దౌత్యపరమైన ఉత్కంఠ నెలకొని ఉండే. అయితే సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు ఢిల్లీలో జరిగే సమావేశాలకు జీ జిన్‌పింగ్ హాజరు అవుతున్నట్లు ఇవాళ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. వాస్తవానికి చైనా అధ్యక్షుడి పర్యటన సమాచారం వెల్లడించేందుకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి గువో జియా కున్ నిరాకరించారు.
దీంతో జిన్‌పింగ్ రాకపై కాస్త అనుమానం నెలకొన్నది. కానీ ఆ డౌట్స్‌ను క్లియర్ చేస్తూ విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. జిన్‌పింగ్ చివరిసారి 2019లో ఇండియాలో పర్యటించారు. ఆయన చెన్నైలోని మామల్లపురంలో ప్రధాని మోదీ ఆ భేటీలో పాల్గొన్నారు. అయితే 2020లో చోటుచేసుకున్న గల్వాన్ ఘర్షణ తర్వాత జిన్‌పింగ్ ఇండియాలో పర్యటించడం ఇదే మొదటిసారి అవుతుంది.