మూసీ పునరుద్ధరణే సర్కారు లక్ష్యమా.. అందులో భాగమే ఈ వ్యూహమా.. అంటే అవుననే అంటున్నారు మూసీ వరద బాధితులు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎప్పుడో పూర్తిస్థాయిలో నిండిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటిని కిందికి వదలాల్సి ఉన్నా తాత్సారం చేసింది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద పెరగడంతో ఒక్కసారిగా రెండు చెరువుల నీటిని పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి నదిలోకి వదిలారు. దీంతో చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. దీంతో మూసీ రివర్ బెడ్ బాధితులు వరదనీటిలో చిక్కుకుని బిక్కుబిక్కు మంటున్నారు. ఎటువెళ్లాలో, ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
వరద కట్టడికి కట్టిన జలాశయాలనే వాడుకొని..
1908 నాటి భారీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలను మూసీ ఉపనదిపై చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. నాడు నిజాం రాజు ప్రజలను కాపాడేందుకు ఈ రిజర్వాయర్లు కడితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సిటీ నుంచి తరిమికొట్టేందుకు ఆ జంట జలాశయాలను వాడుకున్నది. ఇన్నిరోజులూ నీటిని విడుదల చేయకుండా ఆపి..శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా రెండు రిజర్వాయర్ల నుంచి నీటిని వదలడంతో మూసీ ఒక్కసారిగా ఉప్పొంగి నగరవాసులను అతలాకుతలం చేసింది.
నిండా మునిగిన ఇండ్లు..
చాదర్‌ఘాట్‌లో మూసీనది వరద నీటిలో పూర్తిగా మునిగిన పలు ఇండ్లు
ఇండ్లను ముంచెత్తిన వరద
చాదర్‌ఘాట్‌లోని మూసీ రివర్ బెడ్ పరిసరాల్లోని ఇండ్ల చుట్టూ చేరిన వరద
నీటిలో పడవల్లా..
చాదర్‌ఘాట్‌లో ఇండ్లను సగం మేర ముంచుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
బిక్కుబిక్కుమంటూ..
చాదర్‌ఘాట్‌లో వరద పోటెత్తడంతో ఇంటిపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటున్న బాధితుడు
వరదలో వణుక్కుంటూ..
చాదర్‌ఘాట్‌లోని ఓ వీధిలో ప్రవహిస్తున్న వరద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ కుటుంబం
వీధి నిండా వరద
చాదర్‌ఘాట్‌లోని ఓ వీధిలో నడుములోతు వరద
అపార్ట్‌మెంట్లనూ వదల్లే..
చాదర్‌ఘాట్‌లోని పలు అపార్ట్మెంట్ల మధ్య నుంచి వెళ్తున్న వరద
నీట మునిగిన ఆలయం
చాదర్‌ఘాట్‌లో పూర్తిగా నీటిమునిగిన కాళీమాత ఆలయం
వరద పాలవకుండా..
వరదలో కొట్టుకుపోకుండా కార్లను చైన్, తాళ్లతో బంధించి కాపాడుకున్న యజమానులు
బ్రిడ్జి పైనుంచి ప్రవాహం
ఎంజీబీఎస్‌లోకి వెళ్లేదారిలో బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న వరద