Bandi Bhageerath | హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? వారు కూడా మైనర్లేనా? లేక మేజర్లా? అయితే, ఎందుకు బయటికి రావడం లేదు? మీడియా ముందుకు రాకుండా వాళ్లను అడ్డుకుంటున్నదెవరు? ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారి తీసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బండి భగీరథ్ తరపు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి ఎదుట వాదిస్తుండగా.. బాధితురాలి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్, అరె స్ట్ నుంచి ముందస్తు ఊరట ఎందుకు ఇవ్వకూడదో చెబుతూనే.. భగీరథ్ చేతిలో దారుణంగా మోసపోయిన బాధితులు కొందున్నారని న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవికి వివరించారు. భగీరథ్ చేతిలో మోసపోయిన మరో ఇద్దరు బాధితులు త్వరలోనే బయటికి వస్తారని, వారు కూడా భగీరథ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారని ఆశాభా వం వ్యక్తంచేశారు. అయితే, బాధితుల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
విద్యార్థి దశ నుంచే అతని అరాచకాలు దారుణంగా ఉండటం.. విద్యార్థి, విద్యార్థినులే బాధితులుగా ఉండటంతో పలుమార్లు మీడియాలో కూడా వార్తలు ప్రసారం అయ్యాయి. గతంలోనే భగీరథ్ అరాచకాలతో ఇద్దరు యువతులు అభాసుపాలైనట్టు తెలుస్తున్నది. ఆ ఇద్దరు ఎవరనేది బాధిత బాలికకు, న్యాయవాదికి మాత్రమే తెలు సు. భగీరథ్ మైనర్‌ను లైంగికంగా వేధించిన తర్వాత.. ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం బయటికి వచ్చారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా బయటికి వస్తారని అంతా అనుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయవాది నాగేశ్వరరావుకు వారు వివరించడంతో.. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటికి పొక్కడంతో వారు బయటకు రాకుండా బండి భగీరథ్ తరపు అదృశ్యశక్తులు అడ్డుకుంటున్నట్టు తెలిసిం ది. బాధితులను భయపెట్టి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. ఆ ఇద్దరు కూడా మైనర్లే అయితే.. భగీరథ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకవేళ మేజర్లు అయినా కూడా భగీరథ్ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని తెలుస్తున్నది.
భగీరథ్ ఓ మైనర్‌ను మోసగించిన వ్యవహారం బయటికి రావడంతో అతని తండ్రి వైపు అభిమానులు, రాజకీయ నేతలు, భగీరథ్ అనుచరులు ఆ బాలిక ఐడెంటిటీని బయట పెట్టారు. ఆమె తల్లిదండ్రుల వివరాలు సోషల్ మీడియాల్లో పోస్ట్ చే శారు. ఆ బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు, బయటికి తీసి ఆమె వ్యక్తిత్వ హననం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధితులను దారుణంగా బెదిరించారు. ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయ డం వల్లనే.. మిగతా బాధితులు కూడా బయటికి రావడం లేదనే అనుమానాలు ఉన్నాయి. అందుకే వారు కూడా మీడియా ముందుకు వచ్చే ధైర్యం చేయడం లేదని తెలుస్తున్నది. ఆ ఇద్దరిని కూడా ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి, అడ్డుకునేందుకే ‘బండి’ సైన్యం అత్యంత దారుణంగా మొదటి బాలిక వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.