హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ) : అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద తలలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయా? చిరుద్యోగులపై వేటు వేసి వారిని బలిపశువులను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ లీకేజీ కేవలం ఇన్ సర్వీస్ ఏఈవోలకే పరిమితమైం దా? మిగతా విద్యార్థులు, పరీక్షలకు కూడా విస్తరించిందా అనే అంశాలపై సమగ్ర విచారణ జరుపాలని విద్యార్థులు, యూనివర్సిటీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
సర్వీస్‌లో ఉంటూ బీఎస్సీ అగ్రికల్చర్ చది వేందుకు వెళ్లిన ఏఈవోలు పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం అ డ్డదారులు తొక్కి పేపర్ లీకేజీకి పాల్పడిన ఘటనలో ఇప్పటికే 30మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసింది. జగిత్యాల కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్‌తో పాటు వరంగల్ కాలేజీలోని ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై వేటు వేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పరీక్షలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్య త కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్పై ఉంటుంది. ఆ త ర్వాత రిజిస్ట్రార్, వీసీపై ఉంటుంది. కానీ ఈ ముగ్గురు కూడా బాధ్యత లేనట్టు వ్యవహరిస్తున్నారు. కంట్రోలర్‌పై ఎందుకు చర్యలకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా లీకే జీని తేలిగ్గా తీసుకోవడంతో వ్యవహారం తమకు చుట్టుకోకుండా చిన్నవారిపై వేటు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఒక్కో ఏఈవోపై అక్షరాల కోటి ఖర్చు
గతంలో ఉన్నత విద్య అభ్యసించిన ఏఈవోలు లేక డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో బీఎస్సీ(అగ్రికల్చర్) చదివించే అవకాశం కల్పించింది. ఇందుకోసం 1971లో ప్రత్యేక జీవో తెచ్చింది. వారికి సీట్లలో 5శాతం కేటాయించింది. ఉద్యోగంలో చేరిన ఏఈవోలకు ప్రభుత్వం వేతనం చెల్లిస్తూనే, పూర్తి ఖర్చుతో చదివిస్తున్నది. ఇలా ప్రస్తు తం ఏటా 35మంది ఇన్‌సర్వీస్ ఏఈవోలు యూనివర్సిటీతో పాటు కాలేజీల్లో కోర్సు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో ఏఈవోపై సగటున రూ.కోటి ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. ఇన్‌సర్వీస్ ఏఈవోలకు ప్రతి నెలా రూ.లక్ష వేతనం ఇస్తుండగా, నాలుగేండ్ల కోర్సుకు రూ.48లక్షల వేతనం పొందుతున్నారు. ఇక వీరి స్థానంలో రూ.25వేల వేతనంతో అవుట్ సోర్సింగ్‌ను నియమిస్తున్నారు.
వీరికి వేతనం కింద రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. వీళ్లకు యూనివర్సిటీలో సీటు ఫ్రీ. అయితే ఇదే సీటు ఇతర విద్యార్థులు రూ.35 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇతర హాస్టల్ ఖర్చులు కలిపి ఒక్కో ఏఈవోపై రూ.కోటి ఖర్చు చేస్తున్నది. గతంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ఇప్పుడు 800మందికి పైగా గ్రాడ్యుయేట్ ఏఈవోలు అందుబాటులో ఉన్నా డిప్లొమా ఏఈవోలకు ఈ అవకాశం ఇవ్వడమెందుకనే వాదన ఉన్నది. ప్రమోషన్ల కోసమేననే విమర్శలున్నాయి. ఏఈవో నుంచి ఏవో ప్రమోషన్లలో రెగ్యులర్‌గా గ్రాడ్యుయేషన్ చేసిన వారి కన్నా ఇన్‌సర్వీస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన ఏఈవోలకు దక్కుతున్నాయనే విమర్శలున్నాయి.