కోటపల్లి, నవంబర్ 27: మంచిర్యా ల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన శిలాజాలను తెలంగా ణ రాష్ట్ర పురావస్తు శాఖ బృందం గుర్తించింది. గురువారం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బొప్పారం అటవీ ప్రాంతాన్ని సందర్శించి శిలాజాలను సేకరించింది.
అడవుల్లో లభించిన 230 మిలియన్ ఏండ్ల నాటి శిలాజాలను తెలంగాణ స్టేట్ మ్యూజియంలో సందర్శకుల నిమిత్తం ప్రదర్శించనున్నట్టు పురావస్తు శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు మల్లు నాయక్, ఎన్ సాగర్ తెలిపారు.