హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో రెండు రోజులపాటు నిర్వహించిన అన్యువల్ ఆక్వాటిక్ మీట్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది.
స్విమ్మింగ్ పోటీల్లో 75వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ట్రైనీలు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఈ ఆక్వాటిక్ మీట్లో బెస్ట్ స్విమ్మర్‌గా పంకజ్‌యాదవ్ నిలిచారు. జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అమిత్‌గార్గ్, పారా స్విమ్మర్ నిరంజన్ ముకుందన్ డైరెక్టర్స్ విజేతలకు పతకాలు అందజేశారు.