మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 06:22:36

చేనేతలకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం..

 చేనేతలకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం..

చిక్కడపల్లి: బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఒక కోటి చీరలకు ఆదేశాలు ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు  సీఎం కేసీఆర్‌కు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలి ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పద్మశాలి ఉద్యోగుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు చేనేత కోసం కావాల్సిన ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు చేనేత బంధు పథకం ద్వారా సంవత్సరానికి రూ.24,000 ఒక్కొక్క చేనేత కుటుంబానికి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నామిటనేటెడ్‌ పదవుల్లో పద్మశాలీలకు అవకాశాలు కల్పించాలన్నారు. హైదారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పద్మశాలి ఉద్యోగులందరు సంఘటితం కావాలన్నారు. 

 జిల్లా అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, రాష్ట్ర సభ్యులు యాదగిరేందర్‌, విష్ణుమూర్తి, వెంకట్‌రావు, కృష్ణయ్య, శ్రీనివాసులు, రాజ్‌కుమార్‌, విఠల్‌, శ్రీనివాస్‌, మల్లికార్జున్‌, కృష్ణమోహన్‌, సూర్యనారాయణ, జగన్‌ మోహన్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌, శైలజ, సుజాత తదితరులు పాల్గొన్నారు.


logo