హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయం అద్భుత ని ర్మాణమని రిటైర్డ్ అలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం సాయంత్రం సచివాలయంలో వారికి తేనీటి విందు ఇచ్చా రు. ఈ విందుకు రాష్ట్రంలో 1970 నుంచి ఇటీవలి వరకు వివిధ హోదాల్లో సేవలందించి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ముందుగా సచివాలయం ఎదుట గ్రూప్ ఫొటో దిగిన అనంతరం కొత్తగా నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా వారంతా సచివాలయ భవన సముదాయాన్ని అన్ని ఫ్లోర్లను పరిశీలించారు. దేశంలోనే ఆదర్శమైన పరిపాలనా సౌధమని వారు ఈ సందర్భంగా కొనియాడారు. సంక్షే మ, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దేశంలో ప్రథ మ స్థానంలో నిలవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అప్రతిహాత అభివృద్ధిని సాధిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయుడని కొనియాడారు. సచివాలయంలోని ప్రత్యేకతలను, తొమ్మిదేండ్ల ప్రగతిని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ వివరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ కే అశోక్‌రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వీడియో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఏకే కుట్టి, సుజాతారావు, వీపీ జవహరి, పీసీ పారేఖ్, కేవీ రావు, రాజీవ్‌శర్మ, ఎస్కే జోషి, జై భరత్‌రెడ్డి, రస్తోగి, మిన్నీ మాథ్యూస్, ఏకే గోయల్, దినకర్ బాబు, జీ సుధీర్, టీఎస్ అప్పారావు, జీ నాగిరెడ్డి, రేమండ్ పీటర్ ఉన్నారు.