హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేయనున్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆరోగ్యశాఖలో 1,919, కార్మికశాఖలో 257 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేసింది. ఇందులో ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు పొందిన 1,919 మందికి అపాయింట్మెంట్లు అందజేస్తారు.
జీవో-38 ప్రకారం.. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపడుతామని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సచివాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దవాఖానలు, కాలేజీల అవసరాలకు అనుగుణంగా బదిలీలు ఉంటాయని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, క్లినికల్ వర్క్స్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాల్లో పనిచేస్తున్న వారికి బదిలీల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు.
పేషెంట్లకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో వైద్యసేవల ట్రయల్న్ప్రై సమీక్ష నిర్వహించారు. ట్రయల్న్‌ల్రో భాగంగా 22 డిపార్ట్మెంట్లలో ఓపీ సేవలు అందిస్తున్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్‌రే మిషన్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు.