హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అందజేస్తున్న విద్యాదాన్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని మైనారీటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్‌పాషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వార్షిక ఆదాయం రూ.2లక్షలు కలిగి ఉండాలని వెల్లడించారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు పదో తరగతి మెమో, ఇన్‌కం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో www. vidyadaan.org వెబ్సైట్లో జూన్ 20లోగా అప్లైయ్ చేసుకోవాలని సూచించారు. వీరికి జూలై 5న పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. వివరాలకు 8520860785, 9663517131 నంబర్లలో సంప్రదించాలని కోరారు.