హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం మూడోదశ ప్రారంభమైంది. ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 2,000 కంపెనీల్లో 6నుంచి 9నెలల వ్యవధి ఉండే ఈ ఇంటర్న్‌షిప్ కోసం పదో తరగతి నుంచి పీజీ వరకు, ఐటీఐ, పాల్టెక్నిక్ వంటి విద్యార్హతలు ఉన్నవారితోపాటు చివరి సంవత్సరం చదువుతున్నవారు సైతం దరఖాస్తుకు అర్హులు. వయో పరిమితి 18నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9,000 ైైస్టెపెండ్తోపాటు ఒకేసారి రూ. 6.000 గ్రాంటు ఇస్తారు. వ్రివరాలకు 1800116090టోల్‌ఫ్రీ నంబర్‌ను లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎంను కానీ సంప్రదించవచ్చు.