హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): భూభారతి కోసం ప్రత్యేక ఫార్మాట్లో తయారు చేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజు ప్రజలకు ఇవ్వనున్నట్టు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలుకు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసే నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నారాయణ్ పేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌ను తానే స్వయంగా ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు.