హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్తు అంబుడ్స్మెన్ పోస్టుల భర్తీకి విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లా రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ లా సెక్రటరీ(రాష్ట్ర ప్రభుత్వ), క్వాసీ జ్యుడిషియల్ బాడీ సభ్యుడిగా, చైర్మన్గా మూడేండ్లు సేవలందించిన వారు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.