హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాల)లో 6, 7, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు http://telan ganams.cgg.gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మాడల్ స్కూల్స్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 7న నిర్వహిస్తామని పేర్కొన్నారు.