హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య గురువారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 21లోగా దరఖాస్తులు సమర్పించాలి . ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. www.tgcet.cgg.gov.in వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.
ఆర్జేడీగా సోమిరెడ్డికి అదనపు బాధ్యతలు
హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆర్జేడీ ఈ విజయలక్ష్మి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఓపెన్‌స్కూల్ సొసైటీలో పనిచేస్తున్న సోమిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్‌గాను సోమిరెడ్డికే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
టీజీవో ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీవో కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలను గురువారం నిర్వహించారు. అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్ పాల్గొని కేట్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.