TOMCOM | హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): జర్మనీలో ఆటోమోటివ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) దరఖాస్తులు ఆహ్వానించింది. అభ్యర్ధులకు కార్లు, కమర్షియల్ వాహనాల మెకానిజంపై 3-5 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. మెకాట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేక డిప్లొమాను అదనపు అర్హతగా పరిగణిస్తారు. వయసు 20-40 ఏండ్ల మధ్య ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు టామ్‌కామ్ వెబ్సైట్ ద్వారా లేక మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
8న కేఆర్ఎంబీ మీటింగ్
హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): 19వ బోర్డు మీటింగ్‌ను 8వతేదీన నిర్వహించనున్నట్టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) వెల్లడించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు తాజాగా సమాచారం అందించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన ఆపరేషన్ రూల్‌కర్వ్, జలవిద్యుత్తు ఉత్పత్తి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.