వనపర్తి జిల్లా అమరచింత మండల ఈర్లదిన్నెలోని పంట పొలాల్లో గురువారం మొసలి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. రైతు కుంచె నర్సింహులు వ్యవసాయ పనులు చేస్తుండగా మొసలి కన్పించింది.
భయాందోళనకు గురైన ఆయన కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకొన్నారు. పోలీసులతోపాటు స్నేక్ సొసైటీ సభ్యులు కృష్ణసాగర్, నరేశ్, వినోద్, సాయి, దేవేందర్, అవినాథ్ తదితరులు వచ్చి రైతుల సాయంతో తాళ్లతో మొసలిని బంధించారు. అనంతరం జూరాల ప్రాజెక్టులో వదిలిపెట్టారు.
– అమరచింత