వరంగల్ చౌరస్తా/కుత్బుల్లాపూర్, జూలై 24 : మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి వైద్య కళాశాలకు గురువారం వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులు అప్పియరెన్స్ నోటీసులు జారీచేశారు. 2022లో పీజీ సీట్ల భర్తీ విషయమై కొన్ని కళాశాలలపై విచారణ చేపట్టారు. అందులో భాగంగానే నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పష్టంచేశారు.