హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలిం గ్ రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష జరుగనున్నది. ఈనెల 14న ఈ పరీక్ష జరుగనుండగా, అదేరోజు పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్నది. ఈ క్రమంలో పరీక్షలు వాయిదా వేస్తారని అభ్యర్థులు ఆశించారు.
కానీ శనివారం హాల్టికెట్లను విడుదల చేసి, 14నే పరీక్ష జరుగుతుందని హాల్ టికెట్లలో పొందుపరిచారు. ఈ మేరకు ఏపీపీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించారు. తమకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు.