భద్రాచలం, అక్టోబర్ 12: ‘ఇసుక లారీల విధ్వంసం వల్ల మేం చావా లా? బతకాలా?’ అంటూ తెలంగాణ సరిహద్దులోని ఆంధ్రావాసులు ఆందోళన వ్యక్తంచేశారు. రేయింబవళ్లూ ఇసు క లారీలు తిరుగుతూ.. రహదారిపై పక్కన నిలిచి ఉండటం, రోడ్లను ధ్వం సం చేస్తుండటంతో తాము ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలోని చర్ల నుంచి వచ్చే ఇసుక లారీలను భద్రాచలానికి సరిహద్దున ఉన్న ఏపీలోని ఎటపాక మండలం చింతలగూడెం, కన్నాయిగూడెం, సీతంపేట గ్రామస్థులు శనివా రం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ఇసుక లోడుతో ఉన్న రెండు లారీలు చర్ల ప్ర ధాన రహదారిపై చింతలగూడెం వద్ద బురదలో దిగబడటంతో ఆ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్పటికే ఆగ్రహం గా ఉన్న ఆయా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతం నుంచి ఇసుక లారీలు తిరగవద్దని, తెలంగాణ లారీలన్నీ మారాయిగూడెం మీదుగా వెళ్లాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి బురదలో కూరుకుపోయిన రెండు లారీలను జేసీబీలు, క్రేన్లతో తీయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం వరకు లారీల్లో ఉన్న ఇసుకను తొలగించి రెండు లారీలను బయటకు తీశారు.