హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ను తాను ఎందుకు కలవద్దు? అని ప్రశ్నించారు. కలవడంలో తప్పు లేదు కదా..? అని అన్నారు. వివిధ సందర్భాల్లో కేటీఆర్, తాను కలిశామని, సీఎం రేవంత్‌రెడ్డిని అడిగి కేటీఆర్‌ను కలవాలా..? అని సెటైర్లు వేశారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తుందని, తమకు తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేశారు. కవితను టీడీపీలోకి తీసుకుంటారా..? అని అడగగా.. కవితను పార్టీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను చేర్చుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లోనూ మోదీకి మద్దతిస్తామని స్పష్టంచేశారు.