హైదరాబాద్ : తెలంగాణ మండలి చైర్మన్ ( Council Chairman ) గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy ) ఆంధ్రప్రదేశ్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సభను నిర్వహిస్తామనడం సరైనది కాదని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ వాడిన భాష తీరు సరిగా లేదని వెల్లడించారు.
అమరావతి బ్రహ్మoడమైన రాజధాని అంటున్న సీఎం ,డిప్యూటీ సీఎం , మంత్రులు అమరావతిలోనే నివాసం ఉండాలని సూచించారు. తెలంగాణ కన్నా ఏపీలో ఎక్కువ సోర్స్ ఉన్నాయి. సముద్ర తీరం ఉంది. రకరకాల పోర్టులు ఉన్నాయి. ఆ నాయకులంతా ఏపీ అభివృద్ధి చూసుకోవాలి తప్ప తెలంగాణా వైపు చూడొద్దని హితవు పలికారు.
తెలంగాణలో విద్వేషాలకు ప్రయత్నించవద్దని తెలిపారు. తెలంగాణ లో 75 శాతం ధాన్యం సేకరణ పూర్తి అయిందని, ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారించాలని కోరారు. రైతులు వరి , పత్తి తప్ప ఏ పంటలు పండించడం లేదని వివరించారు.