మరికల్ : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు నిత్యం స్మరణీయం. శత్రుదేశాలు, ఉగ్రవాదుల పోరులో ప్రాణాలు కోల్పోయ్యే అమరవీర సైనికులకు దేశ ప్రజలిచ్చే గౌరవం అనర్వీచనీయం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరిపారేయడానికి దేశ సరిహద్దులో ప్రాణాలకు ఒడ్డి పోరాడిన ఏపీ( Andhra Pradesh) లోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్( Jawan Murali Naik) నిన్న కశ్మీర్లో ( Kashmir ) చొరబాటుదారుల కాల్పుల్లో వీరమరణం పొందారు.
ఆ సైనికుడి సేవలను స్మరించుకుంటూ తెలంగాణకు ( Telangana ) చెందిన ఓ గిరిజన నూతన దంపతులు వినూత్న తరహాలో పెళ్లి పందిరిలో నివాళి అర్పించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మరికల్ మండలంలోని బుడ్డగాని తండాకు చెందిన అనిల్ కుమార్, రక్షిత వివాహ వేడుకలో కొవ్వొత్తులు వెలిగించి మురళి నాయక్ అమర్హై అంటూ నివాళి అర్పించారు.
దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన మురళి నాయక్ మరణం వృధాగా పోదంటూ , పాక్కు భారత్ సరియైన గుణపాఠం చెబుతుందని తండావాసులు పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుడి సేవలను కొనియాడారు. జై జవాన్ జై కిసాన్ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.