హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని ఏపీ సర్కారు తెలిపింది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునః పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రి బ్యునల్ విచారణ ఢిల్లీలో బుధవారం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, ఎస్ తలపాత్ర ఎదుట సీనియర్ అడ్వకేట్ జయదీప్‌గుప్తా వాదనలు వినిపిస్తూ.. తె లంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే జలయుద్ధాలకు దారితీస్తుందని హె చ్చరించారు.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉ న్నా అది ప్రస్తుతం కొనసాగుతున్న నీటి వి నియోగాల ఆధారంగానే ఉండాలన్నారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ కేటాయింపుల విషయమై 1944లో మద్రాస్, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందానికి ట్రిబ్యునల్ చట్టబద్ధత కల్పించలేదని, తె లంగాణ వాదనల్లో నిజం లేదన్నారు. ఏపీలోని ఔట్‌సైడ్ బేసిన్‌కు నీళ్లివ్వాలన్న ఉద్దేశంతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టును ని ర్మించేందుకు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం అంగీకరించిందని తెలిపారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎస్ఎల్బీసీని ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారని చెప్పారు. ట్రిబ్యునల్ ఎదుట గురువారం కూడా ఏపీ వాదనలు కొనసాగనున్నాయి.