హైదరాబాద్ మే 11 (నమస్తే తెలంగాణ) : పాకిస్థాన్ దాడిలో అమరుడైన వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఏపీ సర్కారు అండగా నిలిచింది. రూ.50 లక్షల ఆర్థికసాయంతోపాటు ఐదెకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటించారు. వ్యక్తిగతంగా మరో రూ.25 లక్షలు అందజేస్తానని వెల్లడించారు.
ఆదివారం ఆయన.. మంత్రులు నారా లోకేశ్, అనిత, సత్యకుమార్, సవితతో కలిసి సత్యసాయి జిల్లా గోరంట్ల మండ లం కల్లితండాలోని మురళీనాయక్ ఇంటికి వెళ్లారు. మురళి పార్థివదేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన తల్లిదండ్రులు శ్రీరామ్, జ్యోతినాయక్ను పరామర్శించారు. కొడుకును కోల్పోయి విలపిస్తున్న వారిని ఓదార్చి ప్రభు త్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
అంతకుముందు కల్లితండాలో మురళీనాయక్ అంత్యక్రియలను అధికార లాంఛనాలు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య నిర్వహి ంచారు. అంతిమయాత్రకు చుట్టుపక్కల ప్రాం తాల ప్రజలతోపాటు వివిధ పార్టీల నాయకులు పెద్దసంఖ్యలతో తరలివచ్చారు. ‘మురళీనాయక్ అమర్హ్రే.. నీ మరణం వృథా కాదు’ అంటూ నినదించారు.