Chandrababu | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అస్సలు మారడం లేదు. హైదరాబాద్, ఐటీ అభివృద్ధి తన ఘనతే అని మరోసారి చెప్పుకొన్నారు.
ఏపీలో సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ఆయన మూడు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ‘నేనే హైదరాబాద్, సైబరాబాద్‌ను అభివృద్ధి చేశాను. దేశంలో అత్యధిక తలసరి ఆ దాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. దానికి కారణం సైబరాబాద్ నగరం. విభజన జరిగిన తర్వాత నేను అభివృద్ధి చేసిన నగరం తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వాళ్లు బాగుపడ్డారు.. తెలంగాణ మాదిరిగానే ఏపీని బాగు చేయాలన్నదే నా జీవితాశయం’ అని చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్లు బాబును ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.