
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు.
12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించింది. వాటిలో అరుణాచల్‌ప్రదేశ్, హరియానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలు ఉన్నాయి.
కాగా, శకటాల ప్రదర్శనలో ఎలాంటి మార్పులు ఉండబోవని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది.