హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఏపీజెన్కో నుంచి రూ.2,172 కోట్లు, ఏపీట్రాన్స్కో నుంచి రూ.772 కోట్లు కలిపి మొత్తంగా రూ. 2,784 కోట్లు రావాల్సి ఉన్నదని, వాటిని త్వరగా కోరుతూ టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్ర భాకర్రావుకు గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఎన్ శివాజీ, పాపకంటి అంజయ్య మాట్లాడుతూ.. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న డిపాజిట్లను ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు జమచేయాలని ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు కుట్రపూరితమని ధ్వ జమెత్తారు. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో విద్యు త్తు ఉద్యోగుల సంక్షేమం కోసం 4 ట్రస్టులు ఉన్నాయని, వాటిలో దాచిన సొమ్ములో రూ.2,900 కోట్లు తెలంగాణ ఉద్యోగులకు చెందినవి ఉన్నాయని తెలిపారు. ఈ సొమ్మును వెంటనే చెల్లించకపోతే తెలంగాణలో ఉన్న ఏపీ పెన్షనర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ నేతలు వినోద్‌కుమార్, షరీఫ్, రా మేశ్వరయ్యశెట్టి, కరంట్రావు, శ్రవణ్‌కుమార్ గుప్తా, తుల్జారాం సింగ్, పరమేశ్వర్, వెంకటేశ్వర్లు, కార్తీక్, ప్ర ణీత, శ్రావ్య, రాములు, అనిల్ పాల్గొన్నారు.