హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్ మా ఇంటి మనిషి.. ఇం టి పెద్ద.. అలిగినా, గులిగినా ఆయనపై కాకుం టే ఇంకెవరిపై అలుగుతం? రాహుల్‌గాంధీ, మోదీ మీద అలుగుతమా? వాళ్లు బయటి మనుషులు. ఎప్పటికైనా ఇంటి మనిషినే అడుగుతం.. కావాల్సిన సాధించుకుంటం.. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే (ఓట్లు).. అని రాష్ట్ర ప్రజలంతా అంటున్నరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగా ణభవన్‌లో వరంగల్‌కు చెందిన బీజేపీ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాదాసు వెంకటేశ్, బక్కా నాగరాజు తదితరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నారాజైనా.. అలిగినా.. గులిగినా.. ఓట్లు మాత్రం కేసీఆర్‌కే గుద్దుతం అని ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నరు.
– కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ.. రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు.. సీఎం కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని చెప్పారు. పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేసిందని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపించిందని.. అందుకే ‘నడిచే ఎద్దునే పొడిచిన’ చందంగా బీఆర్ఎస్ పార్టీపైనే రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. నారాజైనా.. అలిగినా.. గులిగినా.. ఓట్లు మాత్రం కేసీఆర్‌కే గుద్దుతం అని ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు వెల్లడించారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని కేటీఆర్ కొనియాడారు. వృద్ధులైతే తమ పెద్దకొడుకు కేసీఆర్ అంటున్నారని, యువత తమ ఇంటి పెద్దగా భావిస్తున్నారని చెప్పారు. కులమత గొ డవలు లేవని మైనార్టీ బిడ్డలు ఆనందిస్తున్నట్టు చెప్పారు. ఆరుగాలం కష్టపడే రైతులు సైతం.. కేసీఆర్ ఉన్నంతకాలం తమకేమీ కాదని ధీమా తో ఉన్నారని తెలిపారు. స్వరాష్ట్రంలో అన్ని వ ర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
వచ్చే పదవీ కాలంలో వరంగల్‌లో మెట్రో పరుగులు పెట్టిస్తా. ఆ బాధ్యతను నేనే తీసుకుంటా.
– కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు ప్రతి అంగుళం తెలుసునని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘ఒక బక్క పలచని వ్యక్తిని ఓడించేందుకు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, 15 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్రమంత్రులు, వాళ్ల సామంతులు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి తీస్మార్ ఖాన్లు వస్తున్నారు. ఎంత మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చినా.. బీఆర్ఎస్ మాత్రం ప్రజలపైనే భారం వేసింది. సీఎం కేసీఆర్ సింహంలాంటి వ్యక్తి. ప్రతిపక్షాలు గుంపులా వచ్చినా.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది. 2014, 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ సింగిల్‌గా వస్తే. ప్రజలు గెలిపించిర్రు. ఆయన్ని సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది ఢిల్లీవోడు కాదు.. గుజరాతోడు కాదు.. తెలంగాణ గల్లీల్లో ఉండే మా అన్నలు, అక్కలు, తమ్ముళ్లు. మీ ఆశీర్వాదంతోనే కేసీఆర్ ప్రజా జీవితంలో ఉండి మంచి పనులు చేస్తున్నారు’ అని కేటీఆర్ చెప్పారు.
ఇది ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రజలే తేల్చుకుంటారు. వారే గెలుస్తారు.
– కేటీఆర్
దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపా రు. వరంగల్‌కు కూడా ఐటీ కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు రావాల్సి ఉన్నదని తెలిపారు. ‘వచ్చే పదవీ కాలంలో వరంగల్‌లో మెట్రో పరుగులు పెట్టిస్తా. ఆ బాధ్యతను నేనే తీసుకుంటా ’ అని చెప్పారు.కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవి త, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మాజీ ఎమ్మె ల్సీ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములు, ఈగ మల్లేశం, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సింహంలాంటి వ్యక్తి.. ప్రతిపక్షాలు గుంపులా వచ్చినా ఆయన ఎప్పుడూ సింగిల్‌గానే వస్తారు.
– కేటీఆర్
అమెరికాలో ఉద్యోగం వదులుకొని 11 ఏండ్లుగా బీజేపీ కోసం కష్టపడితే తనని ఎ వ్వరూ పట్టించుకోలేదని రాకేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ గెలుపు కోసం శాయ శక్తులా కృషి చేస్తాయని చెప్పారు.