సాధారణ ప్రసవానికి ఎంటోనాక్స్
పురిటి నొప్పులను తగ్గించి సాధారణ ప్రసవాలు చేసేందుకు ఎంటోనాక్స్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రసవ సమయంలో గర్భిణులకు వచ్చే నొప్పులను తగ్గించేందుకు ఎంటోనాక్స్ గ్యాస్ సిలిండర్, మాస్క్ దోహదం చేస్తాయని అంటున్నారు
గ్యాస్ మాస్క్‌తో తగ్గనున్న పురిటి నొప్పులు
కింగ్ కోఠి దవాఖానలో అందుబాటులో
హాస్పిటల్లో 80% నార్మల్ డెలివరీలే
సుల్తాన్‌బజార్, మే 25: పురిటి నొప్పులను తగ్గించి సాధారణ ప్రసవాలు చేసేందుకు ఎంటోనాక్స్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రసవ సమయంలో గర్భిణులకు వచ్చే నొప్పులను తగ్గించేందుకు ఎంటోనాక్స్ గ్యాస్ సిలిండర్, మాస్క్ దోహదం చేస్తాయని అంటున్నారు. ఈ టెక్నాలజీని కింగ్ కోఠి దవాఖానలో వినియోగిస్తున్నట్టు దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెనికోలా తెలిపారు. 2019 నుంచి ఈ సేవలను వినియోగిస్తున్నామని, అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు నిలిపి వేశామని, ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. పురిటి నొప్పులు ఎక్కువయ్యే సమయంలో ఎంటోనాక్స్ మాస్క్ ద్వారా ఆక్సిజన్‌ను పీలిస్తే రెండు నిమిషాల పాటు నొప్పులు తగ్గి ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఈ టెక్నాలజీని విదేశాల్లో ఎక్కువగా వాడుతున్నారని, ఇక్కడ కూడా ప్రైవేట్ దవాఖానల్లో వాడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రసవాల కోసం పేద మహిళలు ప్రభుత్వ దవాఖానలనే ఆశ్రయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గర్భిణులకు ఉపశమనం
ప్రసవాల సమయంలో గర్భిణులు పడే నొప్పుల నుండి ఉపశమనం కలిగించేందుకు ఎంటోనాక్స్ మాస్క్ ఎంతగానో దోహదం చేస్తుంది. దవాఖానలో 2019లోనే ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చాం. కరోనా వల్ల నిలిచినా, ప్రస్తుతం తిరిగి ప్రారంభించటం సంతోషంగా ఉన్నది.
–డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్,
కింగ్ కోఠి దవాఖాన
దవాఖానలో 20 శాతమే సిజేరియన్
దవాఖానలో 20 శాతమే సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. ఎక్కువగా సాధారణ ప్రసవం చేయటానికే మొగ్గు చూపుతున్నాం. దాని కోసం వారితో వ్యాయామం చేయిస్తున్నాం. ప్రత్యేకంగా బాల్ ఇతర క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచాం. గతం కంటే ప్రస్తుతం నార్మల్ డెలివరీలు అధికమయ్యాయి. – డాక్టర్ జలజ వెనికోలా, అడిషనల్ సూపరింటెండెంట్, కింగ్ కోఠి దవాఖాన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Antonax
- deliveries
- Face mask
- Normal
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

