హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ అభ్యంతరాల ఫీజును రూ.500 నుంచి రూ.200 తగ్గించాలని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం (ఎస్పీఎఫ్) డిమాండ్ చేసింది. జేఈఈ, నీట్‌కు రూ.200 మాత్రమే వసూలు చేస్తుండగా, ఎప్‌సెట్ సహా ఇతర పరీక్షలకు రూ.500 వసూలు చేయడం దారుణమని ఫోరం నాయకులు రాహుల్‌నాయక్, శివకృష్ణ వాపోయారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా సెంటర్ లోకేషన్ తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని, ప్రధాన కూడళ్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేయాలని కోరారు.