సిరిసిల్ల టౌన్, మార్చి 24 : ఉపాధి లేక, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు చెల్లించలేని స్థితిలో నేతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మరో కార్మికుడు తనువు చాలించాడు. స్థానిక నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు ఎకల్దేవి దామోదర్(43)కు భార్య కావ్య, కొడుకు, కూతురు ఉన్నారు.
నేత కార్మికుడిగా పనిచేస్తున్న ఈయన కొంతకాలంగా ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చే దారిలేక మనోవేదనకు గురైన దామోదర్ మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.