సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 5: సిరిసిల్లలో మరో నేతకార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ(టెక్స్‌టైల్‌పార్క్)కు చెందిన నేతకార్మికుడు యెల్లె రమేశ్(41)కు భార్య లత, కూతురు భావన(15), కొడుకు శశాంక్(6) ఉన్నారు. కొంతకాలంగా టెక్స్టైల్ పార్క్‌లో సరైన పనులు లేకపోవడంతో రమేశ్ సిరిసిల్లలో పనికి వెళ్తున్నాడు. చేతినిండా పనిలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. 3న తంగళ్లపల్లి-సిరిసిల్ల మానేరువాగు వంతెన నుంచి వాగు లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మానేరువాగులో తేలిన మృతదేహం జేబులో ఉన్న ఆధార్‌కార్డు ద్వారా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.