హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో మరో కార్మిక యూనియన్ సమ్మెకు సిద్ధమైంది.
టీజీఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి డేటాఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, వేతన సవరణతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో ఈ నెల 7న సంస్థ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ఆదివారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని డిపోల కార్మికులు హాజరుకావలని విజ్ఞప్తి చేశారు.