మణుగూరు టౌన్, ఆగస్టు 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో డ్రైవర్.. ఖమ్మంలో ఆర్ఎంను కలిసిన కొద్దిసేపటికే పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనాత్మకంగా మారింది. మణుగూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎస్కే సైదులు సోమవారం ఖమ్మంలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాడు.
ఈ క్రమంలో ఆర్ఎంకు, డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. దీంతో కలత చెందిన సైదులు కార్యాలయం నుంచి బయటకు వచ్చాడు. అనంతరం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి సిబ్బంది అతడిని ఖమ్మంలోని ఒక దవాఖానకు తరలించారు. ఈ వ్యవహారాన్ని ఆర్టీసీ యాజమాన్యం బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచుతున్నది.